
- మతం రంగు పులిమి రాష్ట్రపతికి కేంద్రం పంపలేదు
బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి ప్రభుత్వం కేంద్రానికి పంపిందని.. కానీ, రిజర్వేషన్లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్రం పంపలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు రావని తెలిసే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చలేమని మాట్లాడారని విమర్శించారు.
మంగళవారం తెలుగు యూనివర్సిటీలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించాలని, సుప్రీంలో కేవియట్ పిటిషన్వేసి రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలని కోరారు.