పోస్ట్ డేటెడ్ చెక్లా మహిళా బిల్లు : జాగృతి అధ్యక్షురాలు కవిత

పోస్ట్ డేటెడ్ చెక్లా మహిళా బిల్లు : జాగృతి అధ్యక్షురాలు కవిత
  •     జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లు పోస్ట్​డేటెడ్​ చెక్​లా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మహిళలకు ఓబీసీ కోటా లేకుండానే ఏకపక్షంగా బిల్లు పాస్ చేశారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డీలిమిటేషన్​ను మహిళా బిల్లుకు ముడిపెట్టి పాస్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన 12 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు బిల్లు ప్రయోజనం దక్కలేదన్నారు. 

ఇప్పుడేమో 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారని, మహిళలకు మళ్లీ అన్యాయం జరుగుతుందని తెలిపారు. 2027 జనగణన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్​ చేశారు. మహిళా బిల్లు పెట్టే రోజు ఉదయమే బిల్లు ప్రతులను పార్టీలకు ఇస్తే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని పేర్కొన్నారు.