సోషల్ మీడియాకు చిన్న గ్యాప్‌ అంటున్న కయాదు లోహర్‌‌‌.. రీఛార్జ్‌‌‌‌ కోసం ఏం చేస్తోందంటే..

సోషల్ మీడియాకు చిన్న గ్యాప్‌ అంటున్న కయాదు లోహర్‌‌‌..  రీఛార్జ్‌‌‌‌ కోసం ఏం చేస్తోందంటే..

తమిళ చిత్రం ‘రిటర్న్‌‌‌‌ ఆఫ్​ ది డ్రాగన్‌‌‌‌’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కయాదు లోహర్.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలతో పాటు మలయాళంలోనూ వరుస ప్రాజెక్ట్స్‌‌‌‌ చేస్తూ బిజీగా ఉంది.  షూటింగ్స్‌‌‌‌తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమాలనుకు అందుబాటులో ఉంటుందామె. 

అయితే ఆ సోషల్ మీడియాకు చిన్న బ్రేక్‌‌‌‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.  శరీరానికి ఇచ్చినట్టే మనసుకు కూడా విశ్రాంతి అవసరమని, అందుకే కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు ఆమె ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పోస్ట్ చేసింది.  

మొబైల్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌కు దూరంగా ఉండి తనతో తాను ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నట్టు చెప్పిన ఆమె, ఏమైనా ముఖ్యమైన అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ను తన టీమ్ ఇదే అకౌంట్‌‌‌‌ ద్వారా షేర్‌‌‌‌‌‌‌‌ చేస్తారని రాసుకొచ్చింది.  

ప్రస్తుతం తెలుగులో నానికి జంటగా ‘ది ప్యారడైజ్‌‌‌‌’లో నటిస్తున్న ఆమె, దుల్కర్‌‌‌‌ సల్మాన్‌‌‌‌కు జంటగా ‘ఐయామ్ గేమ్‌‌‌‌’ అనే మలయాళ చిత్రం,  తమిళంలో ఇదయం మురళి, ఇమ్మోర్టల్, అరసన్ సినిమాలు చేస్తోంది. ఇవికాక మరో రెండు మలయాళ చిత్రాలు, ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోంది.