హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఎలక్ట్రానిక్ పరికరాలతో వచ్చిన సిట్

హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఎలక్ట్రానిక్ పరికరాలతో వచ్చిన సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు అంతా సిద్ధమైంది. ఆదివారం (ఫిబ్రవరి 01) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉన్నందున కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయల్దేరిన ఆయన.. మధ్యాహ్నం లోపు నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. 

విచారణలో భాగంగా సిట్ అధికారులు కూడా కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా సిట్ బృందం వచ్చింది.  మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభం అవుతుంది. విచారణ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా నందినగర్‌లో కేసీఆర్ నివాసం వద్ద నాలుగు అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్‌లో సిట్‌ విచారణ జరగనుంది. పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్‌లను మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు.