KCR Birthday : బల్కంపేట ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

KCR Birthday : బల్కంపేట ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్ లోని బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కవిత..ఆలయంలో రాజశ్యామల పూజ నిర్వహించి, అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత చెప్పారు. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందన్న ఆమె... భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.