
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు మృతి పట్ల ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సంతాపం తెలిపారు. సంజయ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హనుమంతరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు మార్చి 29వ తేదీ కన్నుమూశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యాయవాదిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు డాక్టర్ సంజయ్‌కుమార్, సందీప్ కుమార్, కుమార్తె రజిత ఉన్నారు.