ప్రగతి భవన్లో రైడ్స్ చేస్తే వేల కోట్లు దొరుకుతయ్ : షర్మిల

ప్రగతి భవన్లో రైడ్స్ చేస్తే వేల కోట్లు దొరుకుతయ్ : షర్మిల

కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రగతి భవన్లో కేంద్ర సంస్థలు రైడ్స్ జరిపితే వేల కోట్లు దొరుకుతాయన్నారు. దేశంలోనే కేసీఆర్ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అన్నారు.  తనకు, తనవాళ్లకు ఏం జరిగినా కేసీఆర్దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏమిలేని వాళ్లకు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నర్సంపేట ఘటనపై గవర్నర్ తమిళిసైకు షర్మిల ఫిర్యాదు చేశారు.

అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్రలో కేసీఆర్ హామీలపై ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ వయోలేషన్ కేసులో రిమాండ్ అడగడం ఏంటని నిలదీశారు. డబ్బు సంపాదించేందుకే అధికారాన్ని వాడుతున్నారన్నారు.

నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని షర్మిల విమర్శించారు. తాను చెప్పుతో కొడతా అని..ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని..ఇంకెవర్ని అనలేదని స్పష్టం చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామన్నా ఆమె..ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.