అరెస్టులు... నిర్బంధాలు.. అఖిల పక్ష దీక్షకు అడుగడునా అడ్డంకులు

అరెస్టులు... నిర్బంధాలు.. అఖిల పక్ష దీక్షకు అడుగడునా అడ్డంకులు

గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్​ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 12న గన్​పార్క్​లో  దీక్ష చేపట్టాలని నిర్ణయించగా పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. కీలకమైన నాయకులను ఇప్పటికే హౌస్​అరెస్ట్​ చేశారు. 

టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొ.కోదండారం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్, విద్యార్థి సంఘాల నేతలను హౌస్ అరెస్ట్​ చేశారు. దీంతో గ్రూప్​ 2 అభ్యర్థులకు మద్దతుగా చేపట్టిన దీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. పోలీసులు నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి జైళ్లకు తరలిస్తున్నారు. ప్రవీణ్​ కుమార్​ ఇంట్లోనే మౌన దీక్ష చేస్తూ.. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్​ సర్కార్​ ఆడుకోవద్దని విన్నవిస్తున్నారు.

సీఎం కేసీఆర్​ ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. టీఎస్​పీఎస్​ పేపర్​ లీకేజ్​ తర్వాత పరీక్షలు నిర్వహించడానికి టైం ఇస్తామని చెప్పిన కేసీఆర్​ ఇప్పుడు మాట మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నేతలు ఇళ్లలోనే మౌన దీక్షకు దిగారు. 

గ్రూప్​ 2 నిరసనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ అఖిల పక్ష నేతల సూచనతో ఇవాళ్ల ఇంట్లోనే 10 గంటలకు మౌన దీక్షకు కూర్చోనున్నట్లు ఆయన వెల్లడించారు. 

పరీక్ష రద్దు చేసే వరకు పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరీక్ష నిర్వహణకు టైం ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం దారుణమన్నారు. శాంతియుతంగా తెలిపే నిరసనను అడ్డుకోవద్దని విన్నవించారు.