నేడు కేసీఆర్ ప్రధానిని కలిసే అవకాశం

నేడు కేసీఆర్ ప్రధానిని కలిసే అవకాశం

సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఆయన వెంట వెళ్లారు. మూడు రోజుల టార్‎లో భాగంగా సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసే అవకాశముంది. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని ఆయన అడగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా ఏ పంట వేయాలో చెప్పాలని కేసీఆర్ అడగనున్నారని తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను తేల్చాలని ఆయన డిమాండ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నీళ్ల వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్‌‌‌‌కు రిఫర్ చేయాలిని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కులగణను చెపట్టాలని కేసీఆర్ అడగనున్నట్లు సమాచారం. బీసీ కులాల్లోని జనాభా లెక్కింపు చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ కేంద్రం ముందు ప్రతిపాదించనున్నారు. కొత్త కరెంట్ చట్టం తెచ్చి.. మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తుందని కేసీఆర్ అంటున్నారు. పంట పొలాల దగ్గర మీటర్లు పెట్టడానికి తాము సిద్దంగాలేమని కేసీఆర్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. ఈ విషయంపై కూడా కేంద్ర మంత్రులతో ఆయన మాట్లాడనున్నారు.