రేపటి నుంచి జిల్లాలకు కేసీఆర్

రేపటి నుంచి జిల్లాలకు కేసీఆర్
  • ఎండిన పొలాలను పరిశీలించనున్న మాజీ సీఎం

హైదరాబాద్, వెలుగు: నీళ్లందక ఎండుతున్న పొలాలను పరిశీలించేందుకు బీఆర్‌‌‌‌ఎస్  చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఈ నెల 31న ఆయన పర్యటించనున్నారు. కేసీఆర్  తన పర్యటనలో ఎండిన పొలాలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెబుతారని బీఆర్ఎస్  ప్రకటించింది. వాస్తవానికి ఏప్రిల్  మొదటి వారంలో కేసీఆర్  పర్యటన ఉండగా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కేకే, మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీ మారడం, నాయకుల్లో ఉన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోషెడ్యూల్‌‌ను కేసీఆర్  ముందుకు జరుపుకున్నట్లు తెలుస్తోంది.