హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుకు డయానా అవార్డు దక్కింది. సమాజంలో మార్పుల కోసం పనిచేసే వారికి బ్రిటన్ రాజకుమారి.. ప్రిన్సెస్ డయానా పేరిట అవార్డులు ప్రదానం చేస్తారు. 9 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్య కేటగిరిలో హిమాన్షును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్‌ఖాన్ పల్లి గ్రామాల్లో ‘శోమ’ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టు ప్రారంభించారు. తన మెంటార్స్ ద్వారా రెండు గ్రామాల్లోని ప్రజల స్వయం సమృద్ధికి సహకరించడంతో అవార్డు దక్కింది. 15 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ అవార్డు పొందిన హిమాన్షును పలువురు ప్రముఖులు అభినందించారు.
