
అంతర్జాతీయ క్రికెట్ కు చాలాకాలంగా దూరంగా ఉన్న భారత బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ అద్భుతమైన ఆటతో మరోసారి వార్తల్లో నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న కేదార్ జాదవ్ రంజీల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సంచలనం సృష్టించాడు. మహారాష్ట్ర, అస్సాం జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జాదవ్ 218 బంతుల్లో 205 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అస్సాం జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 274 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్రకు డబుల్ సెంచరీ సాధించి కేదార్ జాదవ్ ఆ జట్టుకు భారీ అధిక్యాన్ని అందించాడు.
మూడో రోజు ఆటలో మహారాష్ట్ర 5 వికెట్ల నష్టానికి 452 పరుగులు సాధించింది. ఈ డబుల్ సెంచరీతో కేదార్ జాదవ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే గతకొంతకాలంగా ఫామ్ లోని కేదార్ జాదవ్ ఐపీఎల్ 2023 మినీ-వేలంలో అమ్ముడుపోలేదు. ఐపీఎల్ మినీ-వేలం కంటేముందు కేదార్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి ఉంటే బాగుండని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ లో కేదార్ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై జట్ల తరుపున ఆడాడు.