
కీసర, వెలుగు: కీసర గుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీని బుధవారం (సెప్టెంబర్ 10) లెక్కించారు. మహాశివరాత్రి అనంతరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా రూ.23,67,000, అన్నదానం హుండీ ద్వారా రూ.68,000 సమకూరినట్లు ఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ట్రస్టు బోర్డు సభ్యులు మొరుగు ముత్యాలు, నల్ల మధుసూదన్ రెడ్డి, జూపల్లి సాయిలు, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.