ఆకట్టుకుంటున్న కేజీఎఫ్-2 పోస్టర్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆకట్టుకుంటున్న కేజీఎఫ్-2 పోస్టర్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బెంగళూరు: ఫ్యాన్స్‌‌కు ప్రామిస్ చేసినట్లే కేజీఎఫ్-2 నుంచి కొత్త అప్‌‌డేట్ ఇచ్చాడు ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఫిల్మ్‌‌లో హీరో యష్ లుక్‌ పోస్టర్‌‌‌‌ను రివీల్ చేశాడు. దీంతో పాటు ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌‌ను కూడా ప్రకటించాడు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 8న టీజర్‌‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. ఇంతదూరం చేరుకోవడానికి ఏదాది సమయం పట్టిందని, అయితే మరింత బలంగా, పెద్దగా, భీకరంగా ముందుకొస్తున్నామని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. కొత్త లుక్ పోస్టర్‌‌లో సింహాసనం పై యష్ కూర్చొని ఉన్నాడు. చాలా ఇంటెన్స్‌‌గా ఈ పోస్టర్‌‌ను డిజైన్ చేశారు. కేజీఎఫ్-2 షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. వచ్చే సమ్మర్‌‌లో ఈ మూవీ ప్రేక్షకులను అలరించే చాన్సెస్ ఉన్నాయి. A glance into the Empire ?It might have taken a year longer for this, but we are coming stronger, bigger & deadlier!#KGFChapter2TeaserOnJan8 at 10:18 AM on @hombalefilms youtube.@VKiragandur @TheNameIsYash @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84 pic.twitter.com/evCn5jiBkn — Prashanth Neel (@prashanth_neel) December 21, 2020