రేషన్ బియ్యం అక్రమ రవాణా.. షాపు యజమాని అరెస్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణా.. షాపు యజమాని అరెస్ట్

మెహదీపట్నం, వెలుగు: లంగర్​హౌస్ పెన్షన్ పురాలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రేషన్ షాపు యజమానిని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. సాయికృష్ణ అనే వ్యక్తి షాప్ నంబర్ 509 నిర్వహిస్తున్నాడు.

గురువారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ ఆటోలో సుమారు 250 కేజీల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా, స్థానికుల సమాచారంతో అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడిని లంగర్​హౌస్ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.