- తెలంగాణలో ఏం సాధించారో కమ్యూనిస్టులకు వివరించాలి: సీపీఐ నేత కె.రామకృష్ణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేశామని కేరళలో సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని, అక్కడ అబద్ధాలు చెప్పడం మానేసి.. తెలంగాణలో ఎన్ని హామీలు అమలు చేశారో ఇక్కడి ప్రజలకు, వామపక్ష నాయకులకు వివరించాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేస్తామన్న ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. కేరళ కేబినెట్ వచ్చి తెలంగాణలో పరిశీలించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో అమలు చేసిన హామీలపై ఇక్కడి సీపీఐ, సీపీఎం నేతలతో చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
