‘కేజీఎఫ్​ 2’ ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

‘కేజీఎఫ్​ 2’ ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్..  ఎప్పుడంటే?

హైదరాబాద్: కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ ఎంత పెద్ద హిట్గా నిలిచిందో తెలిసిందే. గోల్డ్‌ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీతో యష్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్లే ఏప్రిల్ 14న మూవీని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. అలాగే ట్రైలర్ ను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో యష్ ఫ్యాన్స్లో ఉత్సాహం మొదలైంది. కాగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్లో నర్తించనుంది.

మరిన్ని వార్తల కోసం:

ధరణితో కొత్త సమస్యలు సృష్టించారు

యువతకు గన్ కాల్చడం నేర్పుతున్న ఉక్రెయిన్ సైన్యం

జిన్పింగ్ ఓ మేధావి.. చైనాను ఆపడం కష్టం