పిలియన్ రైడర్ చేతిలో  ఫోన్ లాక్కున్న కానిస్టేబుల్

పిలియన్ రైడర్ చేతిలో  ఫోన్ లాక్కున్న కానిస్టేబుల్
  • బైకర్​ను పట్టుకునే యత్నంలోకానిస్టేబుల్ ఓవరాక్షన్​ 
  • సోషల్ ​మీడియాలో వైరల్​ 

ట్యాంక్ బండ్, వెలుగు : నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్‌‌‌‌లో ట్రాఫిక్​పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక బైకర్​యత్నించగా, అతడి వెనక కూర్చున్న యువతి చేతిలో నుంచి ఫోన్​లాక్కున్నాడో ట్రాఫిక్​కానిస్టేబుల్​. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంగళవారం సైఫాబాద్​ట్రాఫిక్​పోలీసులు ఎన్టీఆర్​మార్గ్​దగ్గర ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ యువకుడు హెల్మెట్​లేకుండా టూ వీలర్​పై వచ్చాడు. అతడి వెనకే ఓ యువతి కూర్చుని ఉంది. ట్రాఫిక్​కానిస్టేబుల్​వారి బండిని ఆపాడు..పేపర్లు చూపించాలని అడిగాడు. అతడు తీస్తున్నట్టు చేయగా, వెనకే ఒక కార్​ రావడంతో కానిస్టేబుల్​అటువైపు వెళ్లాడు.  ఇదే సమయం అనుకున్న సదరు బైకర్​ఒక్కసారిగా బైక్​ను స్టార్ట్​ చేసి పోనిచ్చాడు.

ఇది గమనించిన కానిస్టేబుల్​అతడి వెనకే కొద్ది దూరం పరిగెత్తి వెనక కూర్చున్న యువతి చేతిలో నుంచి ఫోన్​లాక్కున్నాడు. ఇది వెనకే కారులో వస్తున్న ఓ వ్యక్తి కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయమై వివరాల కోసం సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​సైదిరెడ్డిని వివరణ కోరగా ‘మేం ఎవరి ఫోన్​లాక్కోలేదు. చెకింగ్ పాయింట్ వద్ద జనరల్​గా బైకులను ఆపి చెక్​చేస్తుండగా ఓ బైకర్​వచ్చాడు. అతడిని ఆపే ప్రయత్నం చేయగా, ఆపకుండా వెళ్లిపోయారు. యువతి చేతిలో నుంచి ఫోన్ లాక్కోలేదు’ అని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.