బైక్‌‌ స్టంట్స్‌‌.. నలుగురు అరెస్ట్‌‌

బైక్‌‌ స్టంట్స్‌‌.. నలుగురు అరెస్ట్‌‌

గండిపేట, వెలుగు: ప్రధాన రహదారులపై రాత్రి వేళ బైక్‌‌ స్టంట్స్‌‌ చేస్తున్న నలుగురిని అత్తాపూర్‌‌ పోలీసులు అరెస్టు చేశారు. అత్తాపూర్‌‌ పెట్రోల్‌‌ సిబ్బంది డ్యూటీలో ఉండగా ఈ నెల 27న ఎండీ.అమీర్‌‌బాబా(21), మహ్మద్‌‌ అశ్వక్‌‌(19), మహ్మద్‌‌ సమీరుద్దీన్‌‌(26), మహ్మద్‌‌ నసీత్‌‌(20) రక్షక వాహనం ముందే బైక్‌‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించారు.

ప్రజలను భయాందోళనలకు గురి చేసేలా వాహనం నడిపారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో ఇద్దరు స్నేహితులు స్టంట్స్‌‌ను వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌‌కు తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.