ధరణితో కొత్త సమస్యలు సృష్టించారు

ధరణితో కొత్త సమస్యలు సృష్టించారు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. ధరణి పోర్టల్ వల్ల కేసీఆర్ కొత్త సమస్యలను సృష్టించారని ఆమె మండిపడ్డారు. ధరణి వల్ల భూ సమస్యల పరిష్కారం అవుతాయని, అదో మంత్రదండం అని ముఖ్యమంత్రి చెప్పకున్నారని.. కానీ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని దుయ్యబట్టారు. భూమి ఉన్నోళ్లకు లేనట్లు, లేనోళ్లకు ఉన్నట్లు చూపిస్తూ యజమానులకు లేని పంచాయితీ చేశారన్నారు. భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక.. లంచాలు ఇవ్వలేక రైతన్నలు సూసైడ్ చేసుకుంటున్నారని షర్మిల ట్వీట్ చేశారు. పోర్టల్ లోని సమస్యలను పరిష్కరిస్తే.. ధరణి ఓ పనికిమాలిన పని అని తేలుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకుని ధరణి పంచాయితీలు తెంపాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

యువతకు గన్ కాల్చడం నేర్పుతున్న ఉక్రెయిన్ సైన్యం

జిన్పింగ్ ఓ మేధావి.. చైనాను ఆపడం కష్టం

అతడలా సారథ్యం చేయడం కష్టం