అతడిలా సారథ్యం చేయడం కష్టం

అతడిలా సారథ్యం చేయడం కష్టం

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టుకు చేరువయ్యాడు. ఈ మైలురాయిని చేరుకుంటే దిగ్గజ హోదాను పొందినట్లే. ఈ నేపథ్యంలో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ లాంటి ప్లేయర్లు చాలా అరుదని.. ముఖ్యంగా అతడిలా జట్టును ముందుండి నడపడం చాలా కష్టమన్నాడు. టెస్టు కెప్టెన్సీలో కోహ్లీని మించినోడు లేడన్నాడు. టెస్టుల్లో విరాట్ ఘనమైన వారసత్వాన్ని నడపడం అంత సులువు కాదన్నాడు. టీమిండియాతోపాటు మొత్తం ప్రపంచ క్రికెట్ అతడి బాటలో నడవాల్సి ఉందన్నాడు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో భారత జట్టు ఓ తీవ్రతతో ఆడిందని, అది అద్భుతమన్నాడు. టీమ్ ప్లేయర్లలో విరాట్ తీసుకొచ్చే ఎనర్జీని చూసి.. మిగిలిన జట్లు ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఫిట్ నెస్ తప్పనిసరి అంటూ అతడు తీసుకొచ్చిన ఆదేశాల వల్లే జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్ లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు. కాగా, మొహాలీ వేదికగా శ్రీలంక, భారత్ కు మధ్య టెస్టు సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇది కోహ్లీకి వందో టెస్టు మ్యాచ్. దీంతో టీమిండియా తరఫున వందో టెస్టు ఆడనున్న 12వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. 

మరిన్ని వార్తల కోసం:

యువతకు గన్ కాల్చడం నేర్పుతున్న ఉక్రెయిన్ సైన్యం

జిన్పింగ్ ఓ మేధావి.. చైనాను ఆపడం కష్టం

అధికార పార్టీ మాఫియాతో చేతులు కలిపింది