గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ గణనాథుడు

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ గణనాథుడు

హైద‌రాబాద్: ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం పూర్త‌య్యింది. హుస్సేన్ సాగ‌ర్ లో గంగ‌మ్మ ఒడికి చేరుకున్న ఖైర‌తాబాద్ గ‌ణేషుడు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. ప్రత్యేక పూజల త‌ర్వాత‌ లంబోదరుడు గంగ‌మ్మ ఒడికి చేరుకున్నాడు.  ఖైరతాబాద్‌ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిచ్చాడు. కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరాడు. తొమ్మిది రోజులపాటు భక్తుల చేత విశేష పూజలు అందుకున్నాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో మహగణపతి విగ్రహాన్ని రూపొందించారు. మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం చూసేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లిరావ‌డంతో ట్యాంక్ బండ్ కు వైపున‌కు వ‌చ్చే దారుల‌న్నీ భ‌క్తుల‌తో కిక్కిరిపోయాయి.  గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా నినాదాల‌తో న‌గ‌రం మార్మోగిపోతోంది.