భారత్​ను ముక్కలు చేసే కుట్ర.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ ఆడియో మెసేజ్​

భారత్​ను ముక్కలు చేసే కుట్ర.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ ఆడియో మెసేజ్​
  •  ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గురుపత్వంత్​ ఆడియో మెసేజ్​లో బయటపడిందన్న ఎన్ఐఏ

న్యూఢిల్లీ: భారతదేశాన్ని ముక్కలు చేసి, చాలా దేశాలుగా విభజించాలనుకున్న ఖలిస్థానీ టెర్రరిస్ట్ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఖలిస్థానీ టెర్రరిస్ట్, నిషేధిత సిక్కు వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్​ఫర్​జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. భారతదేశాన్ని ముక్కలుగా విభజించి, చాలా దేశాలు ఏర్పాటు చేయాలని పన్నూన్ కుట్ర పన్నినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) తన నివేదికలో తెలిపింది. భారతదేశ ఐక్యత, సమగ్రతను అతను సవాల్ చేసినట్టు.. ఆడియో మెసేజ్‌‌లలో అధికారులు గుర్తించారు. కాశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేకంగా ముస్లిం దేశం సృష్టించాలని, దానికి ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ అనే పేరు పెట్టాలని గురుపత్వంత్ కుట్ర పన్నాడని వెల్లడైంది.

అర్షదీప్ కు లష్కరే తాయిబాతో లింక్స్

కెనడాకు చెందిన ఖలిస్తానీ టెర్రరిస్ట్ అర్షదీప్ దల్లాకు టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తాయిబాతో లింక్స్ ఉన్నాయని, పంజాబ్‌‌లోని హిందూ నేతలను టార్గెట్ చేయడమే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. భారత్ కెనడా మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ పోలీసులు జహంగీర్​పురిలో దాడులు చేసి ఆయుధాలతో ఉన్న జగ్జీత్​సింగ్​జగ్గా, నౌషద్​లను పట్టుకున్నారు. వారిని విచారించిన పోలీసులు ఇటీవల చార్జ్​షీట్​దాఖలు చేశారు. అందులోని కీలక విషయాలిప్పుడు బయటకొచ్చాయి. తాను అర్షదీప్​ దల్లాతో టచ్​లో ఉన్నానని, పంజాబ్​లో ఉగ్రవాద చర్యలకు సిద్ధంగా ఉండాలని తనకు దల్లా సూచించినట్లు జగ్జీత్​సింగ్ ​విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు చార్జ్​షీట్​లో పేర్కొన్నారు. లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ సుహైల్​తో అర్షదీప్​ దల్లాకు లింక్స్
ఉన్నాయని పోలీసులు గుర్తించారు.