ట్రావెల్స్‌‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘటన

ట్రావెల్స్‌‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘటన

పెనుబల్లి, వెలుగు : ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ బస్సు బోల్తా పడడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. శ్రీకేవీఆర్‌‌ ట్రావెల్స్‌‌కు చెందిన బస్సు ఏపీలోని ఎన్‌‌టీఆర్‌‌ జిల్లా చెక్కపల్లి నుంచి హైదరాబాద్‌‌కు వెళ్తోంది. సత్తుపల్లిలో కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకోగా.. బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. బస్సు పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామం వద్దకు రాగానే అదుపుతప్పి గోడ ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న వీఎం బంజరు పోలీసులు గాయపడిన వారిని సత్తుపల్లి ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు.