కిడ్నాప్‌కు గురైన మైనర్ బాలిక యూపీలో దొరికింది

V6 Velugu Posted on Mar 30, 2021

  • బాలికతోపాటు నిందితుడ్ని ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం

ఖమ్మం: గత డిసెంబర్ నెల 17వ తేదీన కిడ్నాప్ కు గురైన  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఆచూకీ దొరికింది. కేసు నమోదు చేసిననాటి నుండి సవాల్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్సై ఉదయ్ కిరణ్ స్వయంగా యూపీకి వెళ్లి మైనర్ బాలికను తీసుకొచ్చారు. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు వంద రోజులు శ్రమించిన ఎర్రుపాలెం ఎస్సై  ఉదయ్ కిరణ్ నింనిందితుడు వారి ఇంటికి వచ్చి వెళ్లిన గుంటూరు పూజారి సూర్యప్రకాష్ శర్మనేనని గుర్తించారు. గత డిసెంబర్లో రేమిడిచర్ల లో క్షుద్ర పూజలు నిర్వహించేందుకు వచ్చిన గుంటూరు పూజారి  సూర్య ప్రకాష్ శర్మ మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసినట్లుగా విచారణలో తేలింది. బాలికతో పాటు నిందితుడు సూర్యప్రకాష్ శర్మ ను పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.కిడ్నాప్ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎర్రుపాలెం ఎస్ఐ ఎస్సై ఉదయ్ కిరణ్ ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 

Tagged Minor girl, Khammam district, UP, found, kidnapped

Latest Videos

Subscribe Now

More News