సీఎం విజయ్‌ ఇంటికి ఖుష్బూ ఫ్యామిలీ.. కూతురి పెళ్లికి స్పెషల్ ఇన్విటేషన్!

సీఎం విజయ్‌ ఇంటికి ఖుష్బూ ఫ్యామిలీ..  కూతురి పెళ్లికి స్పెషల్ ఇన్విటేషన్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అటు సినీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకుసెలబ్రిటీలు, ప్రముఖులు ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు.  లేటెస్ట్ గా ఈ లిస్ట్‌లో సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ చేరారు.

విజయ్ తో ఖుష్బూ భేటీ..

అయితే, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు... ఒక స్పెషల్ వెడ్డింగ్ ఇన్విటేషన్. ఖుష్బూ తన భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి, కుమార్తెలు అవంతిక, ఆనందిత, అలాగే కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌లతో కలిసి సీఎం విజయ్‌ను కలిశారు. తన పెద్ద కుమార్తె అవంతిక వివాహానికి రావాలంటూ విజయ్‌కు స్వయంగా పెళ్లి పత్రికను అందించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఖుష్బూ ఎమోషనల్ నోట్..

విజయ్ ను చూడటం ఎప్పుడూ మా హృదయాలను గర్వంతో, సంతోషంతో నింపేస్తుంది. నా పిల్లలైతే ఆయన్ను చూసి థ్రిల్ అయిపోయారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మాపై అదే పాత ప్రేమాభిమానాలను చూపిస్తూ, తనదైన చిరునవ్వుతో విజయ్ మమ్మల్ని ఆహ్వానించారు. థాంక్యూ మై బ్రదర్... మీ అమూల్యమైన సమయం, ఆశీస్సులు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చాయి అంటూ ఖుష్బూ ఎమోషనల్ అయ్యారు.

ALSO READ : రామ్ చరణ్ 'పెద్ది' దెబ్బకు బాలీవుడ్ విలవిల..

కూతురి పెళ్లిని ఖుష్బూ దంపతులు చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఖుష్బూ... దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. మోదీ కూడా ఈ జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 2020లో బీజేపీలో చేరిన ఖుష్బూ, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. . ఏదేమైనా సీఎం విజయ్ వెడ్డింగ్ కార్డ్ అందుకోవడంతో ఈ పెళ్లి వేడుక ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది..