- హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో ఘటన
జీడిమెట్ల, వెలుగు : నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఐదో అంతస్తు పైనుంచి పడి ఓ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో గురువారం జరిగింది. సీఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం... ఓం శ్రీ గెలాక్సీ సంస్థ కొంపల్లిలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీప్రదీప్, అతని భార్య ఉమ పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు.
గురువారం ప్రదీప్, ఉమతో పాటు మేస్త్రీ మోను కలిసి ఐదో అంతస్తులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్తె కాబ్య బర్మా (4) పక్క గదిలోకి వెళ్లి ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కిందపడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
