కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, అణ్వాయుధాల వాడకాన్ని నిరోధించేందుకు అమెరికా తరహాలోనే రష్యా కూడా సాయపడుతుందని ప్రెసిడెంట్ పుతిన్ చెప్పారు. ఈ క్రమంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, దేశభద్రత తదితర విషయాల్లో కొరియా ఆందోళనను అర్థం చేసుకోగలమని అన్నారు. ఈమధ్య అమెరికా, ఉత్తర కొరియాల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ఉన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌పుతిన్ తో వ్లాదివోస్తోక్ లో గురువారం భేటీఅయ్యా రు.
ఫార్ ఈస్ట్ స్టేట్ యూనివర్సి టీలో జరిగిన ఈ సమావేశం షెడ్యూల్ టైంకన్నాఎక్కువసేపు.. దాదాపుగా రెండు గంటలపాటు కొనసాగింది. సమావేశం ముగిసాక నేతలిద్దరు బయటికి వచ్చి చివరిసారి కరచాలనం చేసుకున్నాక కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత పుతిన్ ఒంటరిగానే మీడియాతో మాట్లాడారు. మీటింగ్ అర్థవంతంగా జరిగిందని చెప్పారు. ఇంటర్నేషనల్ లాకు అన్నిదేశాలు కట్టుబడి ఉండే పరిస్థితి రావాలంటూ, కొరియా భూభాగంపై ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ మద్ధతు ఉంటుందన్నారు. ఈ ప్రాసెస్‌లో కొరియా ఆందోళనలను, సెక్యూరిటీ పట్ల కోరుకుంటున్న గ్యారంటీని అర్థం చేసుకోవడానికి కిమ్ పర్యటన ఉపయోగ పడుతుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు పుతిన్ చెప్పారు.
