బిల్లుపై రాహుల్ ఒక్క ముక్కా మాట్లాడలే..సభను తప్పుదోవ పట్టించేందుకే యత్నించారు: కిరణ్ రిజిజు 

బిల్లుపై రాహుల్ ఒక్క ముక్కా మాట్లాడలే..సభను తప్పుదోవ పట్టించేందుకే యత్నించారు: కిరణ్ రిజిజు 

న్యూఢిల్లీ:లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగితే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ బిల్లు గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బిల్లుపై చర్చించడంలో విఫలమైన ఆయన.. నిరసనకారులపై కాల్పులకు అమిత్ షా ఆదేశించారని నిరాధార ఆరోపణలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారన్నారు.

బుధవారం లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్ బయట మీడియాతో రిజిజు మాట్లాడారు. బిల్లుపై చర్చలో రాహుల్ మాట్లాడకపోవడంతో తాను నిరాశ చెందానన్నారు. ఆయన హోం మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.