కేటీఆరే అసలైన కోతల మాస్టర్ : కోదండ రెడ్డి

కేటీఆరే అసలైన కోతల మాస్టర్ : కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేటీఆరే అసలైన కోతల మాస్టర్ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శించడంపై ఆయన ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీ భవన్ లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్ లకు ఇష్టం లేనట్టు ఉందన్నారు. 

అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు18 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితా పార్ట్–-బీలో పెట్టి ధరణిలో ఎన్నో నిర్వాకాలు చేశారని ఆరోపించారు.  దీని ఫలితంగా లక్షల కుటుంబాలు బజారునపడ్డాయని విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధరణి పేరుతో నల్గొండ జిల్లాలో వందల ఎకరాలు కబ్జా చేశారని, త్వరలోనే ఆయన బండారం బయటపడుతుందన్నారు. ధరణిలో జరిగిన అన్ని అక్రమాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు.