13 కోట్ల టాయిలెట్లను కట్టించిన ఘనత మోడీది: కిషన్ రెడ్డి

13 కోట్ల టాయిలెట్లను కట్టించిన ఘనత మోడీది: కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 13 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మధుర నగర్ లోని క్షత్రియ సమాజ్ లో, కీర్తి అపార్ట్ మెంట్స్ లో పార్టీ కార్యకర్తలతో కిషన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి శాంతిని నెలకొల్పిన ఘనత మోడీదని అన్నారు. త్రిబుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారన్నారు. గతంలో ఏ ప్రధాని చెయ్యని విధంగా దేశ సరిహద్దుల్లో ‌రక్షణ విధుల్లో ఉన్న సైనికులతో గడిపిన ప్రధాని.. మోడీ అని అన్నారు. దేశాన్ని అన్ని రంగాలలో అద్భుత ప్రగతికి కృషి చేస్తున్న మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కిషన్ రెడ్డి కోరారు.