బీజేపీ చీఫ్ నడ్డాతో కిషన్ రెడ్డి భేటీ

బీజేపీ చీఫ్ నడ్డాతో కిషన్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ చీఫ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ.నడ్డాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం నడ్డా ఆఫీసులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధ్యక్ష మార్పు జరగనుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, బీజేపీ అధిష్టానం ఇటీవల కిషన్ రెడ్డికి జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించింది. 

అలాగే, కేంద్ర డీవోపీటీ సహాయమంత్రి జితేందర్ సింగ్ ను ఆయన కార్యాలయంలో కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, గురువారం కిషన్​ రెడ్డి హైదరాబాద్​కు రానున్నారు.