తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది : కిషన్​ రెడ్డి

తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది : కిషన్​ రెడ్డి
  • నిశ్శబ్ద విప్లవం రాబోతోంది
  • చాలా సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూలం
  • మా వెంటే యువత, నిరుద్యోగులు, బడుగు వర్గాలు 
  • బీసీ సీఎం, మ్యానిఫెస్టో తర్వాత పెరిగిన గ్రాఫ్
  • ఈ వారంలో ఆరు మోదీ సభలకు ప్లాన్
  • రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ సర్కారు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, చాలా సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నదని, ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈస వర్గీకరణ కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందున్నన దానిని వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ లా కమిటీ వేసినట్టు చెప్పారు. ఎస్సీ వర్గకరణ తమకు అనుకూలంగా మారిందని వివరించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెలా మొదటి తారీఖును జీతాలు ఇస్తామని తెలిపారు. అంచనాలకు మించి క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల నుంచి బీజేపీకి ఆదరణ, మద్దతు లభిస్తోందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు బిజెపి మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ ప్రచార రథాలను ఊళ్లలోకి రానివ్వడం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్ కారు పోవడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకు ఉన్నదని చెప్పారు.

దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తం తాగిందన్నారు. 1969 ఉద్యమంలో 365 మంది విద్యార్థులను, మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ అని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, తాము చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తామని వివరించారు. జల యజ్ఞం పేరుతో కాంగ్రెస్.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో సమర్థవంతమైన డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే, అభివృద్ధి జరగాలంటే బిజెపి సర్కారు తెలంగాణలో రావాలన్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయని విమర్శించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలకే దిక్కులేదు.. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.