సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.303 కోట్లు నిధులు : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.303 కోట్లు నిధులు : కిషన్ రెడ్డి
  • కేంద్రమంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ అంగీకరించారు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి పనుల కోసం రూ.303 కోట్లు ఇచ్చేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్  అంగీకరించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిధులు కంటోన్మెంట్ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తోడ్పడతాయని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములను హెచ్ఎండీఏకు బదిలీ చేయాల్సి ఉంది. ఈ భూ బదిలీకి సంబంధించిన రూ.303.62 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జమ చేస్తోంది. 

ఈ నిధులు నేరుగా కంటోన్మెంట్ అభివృద్ధికి ఉపయోగపడేలా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రిని కిషన్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాశారు. కిషన్ రెడ్డి విజ్ఞప్తికి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఎస్క్రో ఖాతా ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఈ నిధులను పూర్తిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. రూ.303 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.