
ఇంగ్లాండ్ తో జరగబోయే నాలుగో టెస్టుకు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆడడం కన్ఫర్మ్ అయింది. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ లో జూలై 23 (బుధవారం) నుంచి నాలుగో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించలేదని తెలుస్తోంది. లార్డ్స్ టెస్టులో గాయపడిన పంత్ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో మాంచెస్టర్ టెస్టుకు స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పంత్ స్థానంలో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కు అనుమతి ఉంటుందా అనే విషయంలో నెటిజన్స్ గందర గోళానికి గురవుతున్నారు.
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తుది జట్టులో లేకుండా ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు వేరే ఆటగాడి స్థానంలో ప్రత్యామ్నాయ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడానికి అనుమతి ఉండదు. నాలుగో టెస్టుకు పంత్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఆడితే అతని స్థానంలో మ్యాచ్ ప్రారంభంలోనే ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కు అనుమతి ఉండదు. దీంతో అందుబాటులో ఉన్న వికెట్ కీపర్‌లలో కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ లలో ఒకరు ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి.
పంత్ గాయపడడంతో మూడో టెస్టులో జురెల్ ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ గా వచ్చాడు. అయితే నాలుగో టెస్టులో పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా బరిలోకి దిగితే జురెల్ ప్రత్యామ్నాయ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేయడానికి ఉండదు. కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11 లో ఉంటాడు కాబట్టి అతడే పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ చేయవచ్చు. ఒకవేళ జురెల్ కు ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వస్తే అతడే కీపింగ్ చేస్తాడు.
అసలేం జరిగిందంటే..?
లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ రిషబ్ పంత్ చేతి వేలి గాయం కారణంగా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. తొలి రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుమ్రా వేసిన 34 ఓవర్ రెండో డెలివరీ పంత్ చేతి ఎడమ చేతి వేలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడడంతో ఫిజియో వచ్చి స్ప్రేను తన చేతి వేలికి చల్లాడు. నొప్పి తగ్గకపోవడంతో పంత్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు. ఇంగ్లాండ్ స్కోర్ 93 పరుగుల వద్ద పంత్ గ్రౌండ్ వీడి వెళ్ళాడు. ఈ మ్యాచ్ లో పంత్ తన కీపింగ్ తో ఆకట్టుకున్నాడు. రెండు అద్భుతమైన క్యాచ్ లు పట్టడమే కాకుండా అసాధారమైన విన్యాసాలు చేశాడు.
Rishabh Pant could play the 4th Test as a specialist batter. pic.twitter.com/brIaXHLu7O
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2025