
పాక్ తో ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధవన్ స్థానంలో ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే ఔట్ అయ్యాడు. రియాజ్ బౌలింగ్ లో బాబర్ అజంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 78 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేశాడు రాహుల్.
మరోఓపెనర్ రోహిత్ శర్మ ఫస్ట్ నుంచి దూకుడు కొనసాగిస్తున్నాడు. 35 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ… సెంచరీకి చేరువలో ఉన్నాడు. మూడు సిక్సులు తొమ్మిది ఫోర్లతో దూకుడు కొనసాగిస్తున్నాడు. ఫస్ట్ నుంచి పాక్ బౌలర్లపై విచురుకు పడుతున్నాడు. అయితే రోహిత్ దూకుడుకు పాకిస్తాన్ ఏకంగా 23 ఓవర్లకే ఏడు మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది.