
నార్తాంప్టన్: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నేపథ్యంలో.. టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెడ్‌బాల్ ఫార్మాట్‌పై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా సీనియర్ టీమ్ కంటే ముందే తాను ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లాడు. ఫలితంగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే అనధికార రెండో టెస్ట్‌లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగే చాన్స్ ఉంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలుదేరుతుంది. ఇంగ్లండ్‌లో రెండు సెంచరీలు కొట్టిన రాహుల్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్లేస్‌ల్లో ఒకదాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లలో రాహులే సీనియర్ కావడంతో అతనిపై ఎక్కువ బాధ్యత ఉంటుంది.
58 టెస్ట్‌ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్‌లోనే ఆడిన రాహుల్‌ను అదే ప్లేస్‌లో కంటిన్యూ చేస్తారా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతానికి ఈ ఫార్మాట్‌లో అతని సగటు 33.57గా ఉంది. షెడ్యూల్ ప్రకారం గిల్, సాయి సుదర్శన్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి ఉన్నా.. ఐపీఎల్ రూల్స్ వల్ల రాలేకపోయారు. లీడ్స్‌లో జరిగే తొలి టెస్ట్‌కు ముందు ఈ ఇద్దరు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనున్నారు.
తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆకాశ్‌దీప్‌కు చాన్స్ లభించొచ్చు. యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ ఫామ్‌లో ఉండటంతో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌ను మిడిలార్డర్‌లో ఆడించొచ్చు. డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్‌ను తొలి టెస్ట్ నుంచి తప్పించడం కష్టం. కాబట్టి రాహుల్‌ను ఎక్కడ ఆడిస్తారనేది చూడాలి. పేస్ బౌలింగ్ స్లాట్ కోసం శార్ధూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. నితీశ్‌కు ఫిట్‌నెస్ సమస్యలు అడ్డంకిగా మారొచ్చు. తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ ప్రధాన జట్టులోకి వచ్చిన క్రిస్ వోక్స్, జోష్ టంగ్ నుంచి ముప్పు పొంచి ఉంది.