Mobile Safety: మీ ఫోన్ రిపేర్ కోసం ఇస్తున్నారా..? ఈ టెక్నిక్ వాడితే ఫొటోలు, డేటా సేఫ్..

Mobile Safety: మీ ఫోన్ రిపేర్ కోసం ఇస్తున్నారా..? ఈ టెక్నిక్ వాడితే ఫొటోలు, డేటా సేఫ్..

Data Safety: ఈ రోజుల్లో ఏ చిన్న పని పూర్తి చేయాలన్నా సెల్ ఫోన్ తప్పని సరి. బ్యాంక్ పనుల నుంచి ప్రభుత్వం అందించే పథకాల వరకు అన్నిపనులు ఫోన్ ద్వారానే చేయాల్సిన పరిస్థితి. దీనికి తోడు వ్యక్తిగత డేటా, ఫ్యామిలీ వీడియోలు ఫోటోలు అంటూ చాలా సమాచారం ఉంటుంది. 

ఇంత వ్యక్తిగత డేటా ఉన్న ఫోన్ రిపేరుకు ఇవ్వటానికి చాలా మంది సాహసించరు. తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందనే భయం ఉంటుంది. ఎందుకంటే ఫోన్ రిపోరుకు ఇచ్చినప్పుడు దానికి ఉండే లాక్ తీసి ఇవ్వమని టెక్నీషియన్స్ కోరుతుంటారు. వాస్తవానికి టెక్నీషియన్ దురుద్ధేశం లేకుండా తన పని తాను పూర్తి చేయటానికి లాక్ వివరాలు కోరినప్పటికీ చాలా మందిలో మాత్రం భయం అలాగే ఉంటుంది. 

అయితే ఫోన్ రిపేరుకు ఇవ్వాల్సిన సందర్భంలో ఒక చిట్కా పాటిస్తే ఫోన్ డేటా సేఫ్ అలాగే రిపేరు కోసం టెక్నీషియన్ కి ఫోన్ లాక్ వివరాలను అందించాల్సిన అవసరం ఉండదు. అయితే శాంసంగ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు వస్తున్న ఇతర ఫోన్లలో కూడా ఈ ఫీచర్ రిపేర్ మోడ్ పేరుతో వస్తోంది. 

* ముందుగా ఫోన్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
* అందులో డివైజ్ కేర్ కింద మెయిన్టినెన్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది.
* మెయిన్టినెన్స్ మోడ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వెంటనే అది రిపేర్ మోడ్ కి తీసుకెళుతుంది
* ఆ తర్వాత అక్కడ ఉండే చెక్ బాక్సుపై టిక్ చేసి.. రిపేర్ మోడ్ ఎనేబుల్ చేయాలి.

ఇలా చేసిన తర్వాత మీ డేటా, అలాగే యాప్స్ స్కీన్ మీద చూపించవు. రిపేరు పూర్తయిన తర్వాత తిరిగి మెయిన్టినెన్స్ మోడ్ డిసేబుల్ చేసుకుంటే గతంలో మాదిరిగానే మీ ఫోన్ లో డేటాను తిరిగి యాక్సెస్ చేయగలరు. 

  • Beta
Beta feature