ఆధార్ ఎక్కడ అంగీకరిస్తారు.. వేటికి నిరాకరిస్తారు: ఫుల్ క్లారిటీ

ఆధార్ ఎక్కడ అంగీకరిస్తారు.. వేటికి నిరాకరిస్తారు: ఫుల్ క్లారిటీ

Aadhaar: 140 కోట్లకు పైగా ప్రజలు ఉన్న భారత దేశంలో ఆధార్ చాలా ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉన్న సంగతి తెలిసిందే. పేరు నుంచి జాతీయత వరకు ప్రజలకు రుజువుగా నిలుస్తోంది. చాలా మందికి ఇప్పటికీ ఈ కార్డు ఏఏ చేయగలదు, ఏమి చేయలేదనే అంశాలపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. 

వాస్తవానికి ఆధార్ కార్డులను యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే 12 అంకెల గుర్తింపు కలిగిన కార్డు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని  బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ ప్రామాణీకరణ, e-KYC ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్టుగా కొనసాగుతోంది.

Also Read:-UPI చెల్లింపుదారులకు అలర్ట్.. NPCI గోల్డెన్ రూల్స్ పాటిస్తే మీ డబ్బు సేఫ్..!

అసలు ఆధార్ కార్డులను భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది?
* రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి వ్యక్తి అధికారికంగా భారత ప్రభుత్వ డిజిటల్ గుర్తింపుగా దీనిని వినియోగిస్తున్నారు.
* సంక్షేమ పథకాల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు నకిలీ లబ్ధిదారులు నిరోధించటానికి తెచ్చారు. 
* మధ్యవర్తులను తొలగించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును డీబీటీ పద్ధతిలో అందించటానికి రూపొందిచారు.
* దేశ ప్రజల డేటాను సమగ్రంగా నిర్మించటం ద్వారా పాలనను మెరుగుపరచే లక్ష్యంతో ఆధార్ తీసుకురాబడింది.

ఆధార్ ఏవేవి ధృవీకరించటానికి దోహదపడుతుంది?
- వ్యక్తుల పేర్లు, వారి బయోమెట్రిక్స్, ఫోటోలను ధృవీకరిస్తుంది
- వ్యక్తి చిరునామాకు ఇది గుర్తింపుగా పరిగణించబడుతుంది

ఆధార్ ఎక్కడ అంగీకరించరు?
- ఆధార్ పౌరసత్వాన్ని నిరూపించటానికి ఆదారంగా అంగీకరించబడదు.
- ఆధార్ మీ ఆదాయాన్ని నిరూపించదు
- పుట్టిన తేదీ వివరాలకు రుజువుగా పరిగణించబడదు
- ఆధార్ వ్యక్తి కులం, మతం, వివాహ స్థితిని ధృవీకరించదు

ఆధార్ ఎక్కడెక్కడ గుర్తింపుగా అంగీకరిస్తారు..
1. బ్యాంక్ ఖాతా తెరిచేందుకు
2. మెుబైల్ సిమ్ కార్డు జారీకి
3. పాస్ పోర్ట్ దరఖాస్తుకు
4. పెన్షన్, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, సబ్సిడీలు పొందేందుకు అర్హత తనిఖీకి
5. పాన్ కార్డుతో లింక్ చేసేందుకు 
6. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్

ఆధార్ అడ్రెస్ ప్రూఫ్ కింద ఎక్కడ అంగీకరిస్తారు..
1. బ్యాంకుల్లో 
2. స్కూల్ అడ్మిషన్ సమయంలో 
3. ప్రభుత్వ సేవలను పొందటంలో