తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీ ఓపెన్..ఆగస్టు 20 వరకు దరఖాస్తులకు చాన్స్

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల  రిజిస్ట్రేషన్లు రీ ఓపెన్..ఆగస్టు 20 వరకు దరఖాస్తులకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 2026–-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల ఆన్‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) పునఃప్రారంభించింది. నీట్ యూజీ అర్హత సాధించి ఇంతకుముందు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈనెల 20 సాయంత్రం 6 గంటల్లోపు https://tsmedadm.tsche.in  వెబ్‌‌‌‌సైట్ ద్వారా దరఖాస్తు లేదా సర్టిఫికెట్లు అప్‌‌‌‌లోడ్ చేయవచ్చు. ఆగస్టు 12తో దరఖాస్తు గడువు ముగియడంతో  విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా, పాత గడువులో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఆగస్టు 4న విడుదల చేసిన నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌‌‌‌ ను పరిశీలించాలని సూచించారు.