కేసీఆర్​ అబద్ధాలను ప్రజలు నమ్మరు : కోదండ రెడ్డి

కేసీఆర్​ అబద్ధాలను ప్రజలు నమ్మరు : కోదండ రెడ్డి
  • కేసీఆర్​ అబద్ధాలను ప్రజలు నమ్మరు
  • కాంగ్రెస్​ కిసాన్ ​సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని, ప్రజలు ఆ అబద్ధాలను నమ్మేంత అవివేకులు కాదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ సెంటిమెంట్ పేరుతో పార్టీ పెట్టుకున్న దిక్కుమాలిన చరిత్ర  కేసీఆర్​ది అని మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. 2004లో తెలంగాణ సెంటిమెంట్​ను బలపరిచేందుకు టీఆర్ఎస్​తో కాంగ్రెస్ పొత్తుపొట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా చేర్చుకున్నామన్నారు.

తర్వాత తన స్వార్థం కోసం ప్రభుత్వం నుంచి తప్పుకొని యువతను రెచ్చగొట్టి వందల మందిని కేసీఆర్ బలిగొన్నారని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏమీ చేయలేక చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు.