
బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా.. కాంట్రాక్టర్ల కోసమే నడుస్తోందన్నారు. జగిత్యాల పెన్షనర్స్ భవన్ లో మాట్లాడిన కోదండరాం.. రాష్ట్రంలో విద్యుత్ కోతల వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. డిస్కంలకు వెంటనే బకాయిలను చెల్లించి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 రాష్ట్రంలోని విద్యుత్ భవనాల ముందు ఆందోళనలు చేస్తామని సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నరసింగాపూర్ రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.