- మే 6నుంచి ప్రత్యేక హోమాలు
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనులను ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఆయన పర్యవేక్షించారు.
ఆలయ విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం, అర్చకుల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్లు దీపక్ తివారీ, ప్రియాంక, ఎండోమెంట్ కమిషనర్ హన్మంత్ రావు, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
