రూ.80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

రూ.80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక తనిఖీలు జరిగాయి. డోర్లు వేసుకొని అధికారులు ఆఫీసులో తనిఖీలు చేపట్టారు.

రాష్ట్రంలో ఇటీవల పట్టుబడుతున్న పలువురు అధికారుల అక్రమ సంపాదన చూస్తే కండ్లు బైర్లు కమ్మాల్సిందే.  వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కీలక అధికారులపై ఏసీబీ జరిపిన దాడుల్లో ఒక్కొక్కరి వద్ద తక్కువలో తక్కువ వంద కోట్ల వరకు ఆస్తులు బయటపడ్డ తీరు సంచలనం సృష్టిస్తోంది.

ALSO READ : శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలో ప్రజలతో నేరుగా సంబంధాలుండే ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ వంటి  శాఖల్లో  అవినీతి దందా తారస్థాయికి చేరింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక వీరిపై ఫిర్యాదులు వెల్లువ మొదలైంది. ఈక్రమంలో దాడుల సందర్భంగా ఆయా అధికారుల ఇండ్లలో బయటపడ్తున్న బంగారం, నోట్ల కట్టలు, ఆస్తుల పత్రాలు చూసి ఏసీబీ అధికారులకు సైతం మైండ్ బ్లాక్ అవుతోంది.