V6 News

కోహ్లీ ఇండియాకు తిరుగుపయనం

కోహ్లీ ఇండియాకు తిరుగుపయనం
సత్తా చూపండి..    టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌కు కోహ్లీ సూచన అడిలైడ్‌‌‌‌:  ఐపీఎల్‌‌‌‌ ముగిసిన వెంటనే జట్టుతో కలిసి ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ మంగళవారం స్వదేశానికి బయలుదేరాడు. కోహ్లీ భార్య అనుష్కశర్మ జనవరిలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో పెటర్నిటీ లీవ్‌‌‌‌ తీసుకున్న విరాట్‌‌‌‌.. ఆసీస్‌‌‌‌తో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ పూర్తి కాకముందే జట్టుకు దూరమయ్యాడు. సిరీస్‌‌‌‌లో మిగిలిన మూడు టెస్టుల్లో అజింక్యా రహానెకు కెప్టెన్సీ అప్పజెప్పాడు. కాగా, స్వదేశానికి బయలుదేరే ముందు టీమ్​మేట్స్‌‌‌‌తో విరాట్‌‌‌‌ మాట్లాడాడు. తొలి టెస్ట్‌‌‌‌ ఓటమితో నిరాశలో ఉన్న ప్లేయర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. ప్లేయర్లంతా ఫీల్డ్‌‌‌‌లో తమ సత్తా చూపాలని, పట్టుదలగా ఆడాలని సూచించాడు. కాగా, ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్‌‌‌‌ మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ వేదికగా శనివారం ప్రారంభం కానుంది.