IPL-2026లో భాగంగా ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లోని నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైటర్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి KKR జట్టు192 పరుగులు చేసింది.బ్యాటర్లు ఆంగరీష్ రఘువంశీ(70), రింకూసింగ్ (48) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజల్వుడ్ చెరో వికెట్ పడగొట్టారు. RCB విజయం సాధించాలంటే 193పరుగులు చేయాల్సింది. అంతకుముందు టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
అంతకుముందు బుధవారం రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రజత్ పాటిదార్ టీం తమ తుది జట్టులో కొద్దిపాటి మార్పుతో బరిలోకి దిగింది. రొమారియో షెపర్డ్ స్థానంలో వెంకటేష్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు కేకేఆర్ కూడా ఒకే ఒక్క మార్పు చేసింది..సీనియర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో సౌరభ్ దుబేకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. ప్లేఆఫ్ కు ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.
