కమిషనరేట్ ఎదుట కొల్లూరు ప్లాట్ల బాధితుల నిరసనలు

కమిషనరేట్ ఎదుట కొల్లూరు ప్లాట్ల బాధితుల నిరసనలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి కొల్లూరులో తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో వేరే వారు తిష్ట వేశారని బాధితులు రోడ్డెక్కారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం మండలంలోని కొల్లూరులో 1984లో పలువురు వ్యక్తులు ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్లాట్లు కొన్నారు. 

అప్పట్లో ధర తక్కువగా ఉండటంతో యజమానులు అంతగా దృష్టిసారించలేదు. ఇదే క్రమంలో ప్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో ఇళ్లు కట్టుకుందామని బాధితులు వెళ్లారు. 

అప్పటికే అక్కడ తిష్ట వేసిన పలువురు ప్లాట్లు తమవని వాదించడంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రౌడీ షీటర్లను పెట్టి తమను ప్లాట్ల వద్దకు రానివ్వట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

పోలీసులకు కంప్లెంట్ చేసినా పట్టించుకోవట్లేదని వాపోయారు. సీపీ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట నిరసన తెలిపారు.