కాంగ్రెస్​లో భవిష్యత్తు లేకనే బీజేపీలో చేరా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్​లో భవిష్యత్తు లేకనే బీజేపీలో చేరా:	కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నిర్మల్​/భైంసా, వెలుగు:  బంగారు తెలంగా ణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికే పరిమితమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్​ రెడ్డి విమర్శించారు. సోమవారం నిర్మల్, భైంసాలో నిర్వహించిన ప్రెస్​మీట్​లలో రాజగోపాల్​రెడ్డి మాట్లాడారు. భైంసా బహిరంగ సభను రద్దు చేసేందుకు టీఆర్ఎస్​ సర్కారు కుటిల ప్రయత్నాలు చేసిందన్నారు. ఎన్నికలెప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

కాంగ్రెస్​లో భవిష్యత్తు లేకనే బీజేపీలో చేరానని, తన తర్వాత రామారావు పటేల్​ లాంటి దమ్మున్నసీనియర్​ లీడర్లు బీజేపీలోకి వస్తున్నారన్నారు. నిజాయితీగా పని చేసే వ్యక్తి రామారావు పటేల్​ బీజేపీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లీడర్లు రావుల రాంనాథ్​, అయ్యన్నగారి భూమయ్య, గంగాధర్​ పాల్గొన్నారు.