తాండూరు, వెలుగు: మేత మేస్తున్న మేకను కొండచిలువ అమాంతం చుట్టేసి చంపేసింది. తాండూరు మండలం సంగెంకలాన్గ్రామానికి చెందిన రైతు నర్సింహులు తన వద్ద ఉన్న ఏడు మేకలను గురువారం మేత కోసం సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పొదల్లో కాపు కాసిన కొండచిలువ అకస్మాత్తుగా ఓ మేకపై దాడి చేసి గట్టిగా చుట్టేసింది.
నర్సింహులు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మేకను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆ మేక ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు ఆత్మరక్షణ కోసం ఆ కొండచిలువపై దాడి చేసి దానిని హతమార్చారు.
