కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలు

కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలు ప్రాంరంభిస్తామని ఈవో రమాదేవి తెలిపారు. ఇటీవల కొండగట్టు ఈవోగా నియమితులైన రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ  విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. వీఐపీ, సామాన్యులను ఒకే విధంగా చూడాలని అర్చకులు, అధికారులకు సూచించారు.

గత ఈవో తీసుకున్న నిర్ణయాలు యథావిధంగా  అమలు చేస్తామని తెలిపారు. భక్తులు సమర్పించే గోల్డ్ సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రసీదులు అందజేస్తామన్నారు. అనంతరం భక్తులతో మాట్లాడి ఆలయంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఏఈవో హరిహరనాథ్ తదితరులు ఉన్నారు.